తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లెటర్లు చెల్లడం లేదని గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై డిసెంబర్ 16న తెలంగాణ మండలిలో డిస్కషన్ జరిగింది. తెలంగాణ ఎమ్మెల్యే లెటర్లను టీటీడీ పట్టించుకోవడం లేదని ఎమ్మెల్సీ మధుసూధనా చారి అన్నారు. ఎమ్మెల్యే సిఫారసు లేఖలను టీటీడీ పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం సర్కార్ ఒత్తిడి తీసుకురావాలని కోరారు. దీనికి సమాధానంగా .. త్వరలో ఏపీ సీఎం చంద్రబాబుతో మాట్లాడుదామన్నారు మంత్రి పొన్నం.. టీటీడీనే కాదు..విభజన అంశాలపై చర్చిస్తామన్నారు.
బీఆర్ఎస్ తీరుతోనే టీటీడీలో తెలంగాణ భక్తులకు ఇబ్బందులు తలెత్తాయన్నారు. టీటీడీ ఛైర్మన్ తో చర్చించి సమస్య పరిష్కరిస్తామన్నారు. తిరుమల దర్శనాలపై టీటీడీకి లేఖ రాశామని చెప్పారు. అంతేగాకుండా టీటీడీ నుంచి ఆలయాల నిర్మాణాలకు నిధులు రావట్లేదన్నారు.
Also Read : జనసేనలోకి మనోజ్, మౌనిక..!
డిసెంబర్ 15న సీఎం రేవంత్ రెడ్డితో టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరీ భేటీ సందర్భంగా కూడా ఈ అంశంపై చర్చకు వచ్చినట్లు తెలిసింది. తిరుమలలో తెలంగాణ భక్తులకు సౌకర్యాల కల్పన, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారస్సు లేఖల అంశం, తిరుమలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున వసతి భవనం నిర్మాణం వంటి అంశాలు కూడా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం.
తిరుమల తిరుపతి దేవస్థానంలో (టీటీడీ) తెలంగాణ ప్రజా ప్రతినిధుల రిక్వెస్ట్ లెటర్లను అనుమతించాలని 2024 ఆగస్టు 12న కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. టీటీడీలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లెటర్లను అనుమతించాలని కోరారు. కొన్నేండ్లుగా తెలంగాణ ఎమ్మెల్యేలు ఇస్తున్న లెటర్లు చెల్లడం లేదని భక్తులు నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ సమస్యకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపాలని కోరారు.