బీసీ బిల్లు దేశానికే రోల్ మోడల్ : మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీ  బిల్లు దేశానికే రోల్ మోడల్ : మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీ బిల్లు దేశానికే రోల్ మోడల్ అవుతుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్.  బీసీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్బంగా మాట్లాడిన ఆయన.. బ్యాక్ వర్డ్ క్లాస్ అంటే సమాజానికి బ్యాక్ బోన్ అని అన్నారు. బీసీ బిల్లును పక్కాగా రూపొందించామన్నారు పొన్నం. బీసీ బిల్లుపై 15 మంది మాట్లాడారు.. బీసీ బిల్లుపై సమగ్రంగా చర్చ జరిగిందన్నారు.  బీసీ బిల్లుకు మతమపరమైన రంగు పూయొద్దన్నారు పొన్నం. బీసీ బిల్లుకు న్యాయపరమైన చిక్కులు రాకపోవచ్చన్నారు పొన్నం.  

బీసీ రిజర్వేషన్ల బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయ అంశాల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ   ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ  ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా మాట్లాడిన  సీఎం రేవంత్ రెడ్డి.. బడుగులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. బడుగుల కోసం పార్టీలకు అతీతంగా ఒక్కటవడం అభినందనీయమని అన్నారు. 2017లో గత ప్రభుత్వం బీసీలకు 37% రిజర్వేసన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసిందని  చెప్పారు. ఆ బిల్లును గవర్నర్ కాన్సెంట్ కోసం పంపిందని, గవర్నర్ రాష్ట్ర పతికి పంపారని తెలిపారు. దానిని ఉపసంహరించుకుంటూ.. కొత్త బిల్లును  పంపుతున్నట్టు సీఎం చెప్పారు. 50% రిజర్వేషన్లు మించొద్దనే నిబంధన ఉందని, దానిపై పార్లమెంటులో రాజ్యాంగ సవరణ అవసరమని  సీఎం అన్నారు. ఇందుకోసం మనందరం పార్టీలకు అతీతంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుద్దామని సీఎం చెప్పారు. 

ALSO READ | విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు

కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ ఇప్పించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అదే విధంగా పార్లమెంటులో ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కూడా కలుద్దామని సీఎం అన్నారు. రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కోసం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రయత్నించాలని కోరారు.