
హుస్నాబాద్, వెలుగు: హుస్నాబాద్నియోజకవర్గంలో విశిష్ట సంస్కృతి, చారిత్రక నేపథ్యమున్న శివాలయాలు ఉన్నాయని, వాటిలో అన్ని వసతులు కల్పిస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆయన మహాశివరాత్రి సందర్భంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఉన్న శివాలయాల్లో పూజలు చేశారు. అనంతరం పొట్లపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
నియోజకవర్గంలో 70 శివాలయాలు ఉన్నాయని, వాటికి ఎంతో చరిత్ర ఉందన్నారు. ఆ ఆలయాల్లో అన్ని రకాల సదుపాయాలను కల్పిస్తామన్నారు. శివరాత్రిని పురస్కరించుకొని తాను 15 ఆలయాల్లో పూజలు చేశానన్నారు. రాత్రి వేములవాడలో లింగోద్భవ పూజలో పాల్గొంటానన్నారు. మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ వొడితల సతీశ్‌కుమార్, బోయినపల్లి వినోద్‌రావు హుస్నాబాద్‌లోని మరకత లింగేశ్వరస్వామి, సిద్ధేశ్వరస్వామి, పొట్లపల్లిలోని రాజన్న ఆలయాల్లో పూజలు చేశారు.