నీరాకేఫ్ ను గీత పారిశ్రామిక కార్పొరేషన్​కు అప్పగిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

నీరాకేఫ్ ను గీత పారిశ్రామిక కార్పొరేషన్​కు అప్పగిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, వెలుగు : నీరాకేఫ్ స్థలం టూరిజం శాఖకు సంబంధించినదని టర్మ్ అండ్ కండీషన్స్ తో దానిని గీత పారిశ్రామిక కార్పొరేషన్​కు అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో శనివారం మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ , ఇతర గౌడ సంఘాల నేతలు మంత్రిని కలిశారు. నీరా కేఫ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం, గౌడ సంఘం భవన నిర్మాణానికి సంబంధించిన అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. 

ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. మార్చి తర్వాత భవన నిర్మాణాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి స్థలం చూసే బాధ్యత తనకు అప్పగించారని చెప్పారు. గతంలో ఒక ఆలోచన చేసి నీరాకేఫ్ ఏర్పాటు చేసి ఉండొచ్చునని, ఇప్పుడు దానిపై రాజకీయం చేయడం అనవసరమని పేర్కొన్నారు.