ఏడాదిలోపు రింగ్​రోడ్డు ఏర్పాటు చేస్తా : మంత్రి పొన్నం ప్రభాకర్

ఏడాదిలోపు రింగ్​రోడ్డు ఏర్పాటు చేస్తా : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ (హుస్నాబాద్​), వెలుగు : వచ్చే ఏడాది జనవరి 26 లోపు హుస్నాబాద్​కు రింగ్​రోడ్డు ఏర్పాటు చేస్తానని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. శుక్రవారం హుస్నాబాద్​లో గాంధీ చౌక్​లో గాంధీ విగ్రహాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా మున్సిపాలిటీ సహకారంతో గాంధీ జంక్షన్ సుందరీకరణ చేసినట్లు చెప్పారు. 

కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఫోర్​లేన్​ రోడ్డుతో 200 ఇండ్లు పోతున్నాయని, ప్రజల విజ్ఞప్తి మేరకు దాన్ని స్థానిక గవర్నమెంట్​ హాస్పిటల్ వరకు మాత్రమే వేస్తున్నామన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయం, ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పరుస్తానన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్​బెడ్ రూమ్ లకు నిధులు కేటాయించి పూర్తి చేస్తామన్నారు.  కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్​ లింగమూర్తి, మున్సిపల్​చైర్​పర్సన్​రజిత, ఆర్డీవో రామ్మూర్తి, కౌన్సిలర్లు ఉన్నారు.