ఎల్కతుర్తి/ భీమదేవరపల్లి, వెలుగు : రాజకీయాల్లో పదవులకే విరామం ఉంటుందని, ప్రజలకు అందించే సేవలో ఉండదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎల్కతుర్తి మండలం, భీమదేవరపల్లి మండల ఎంపీటీసీల వీడ్కోలు సమావేశాలను ఆయా మండల కేంద్రాల్లో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాజకీయాల్లో పార్టీలు వేరైనా ప్రజా ప్రతినిధులు కలిసి కట్టుగా పని చేసి, మంచి సేవలందించారని కొనియాడారు.
ALSO Read :జూన్ 10వ తేదీలోగా వనమహోత్సవం టార్గెట్ రీచ్ కావాలి : కుమార్ దీపక్
అందరికీ భవిష్యత్లో మంచి అవకాశాలు రావాలని కాంక్షించారు. జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ రాజకీయాలలో ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని, ప్రజలే కేంద్రంగా పని చేయడం అలవర్చుకోవాలని సూచించారు. అనంతరం ప్రజాప్రతినిధులను అధికారులు, నాయకులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వంగ రవి , ఎంపీపీ జక్కుల అనిత , తహసీల్దార్ జగత్ సింగ్, ఎంపీడీవో విజయ్ కుమార్, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కడారి రాజు, బావుపేట ఎంపీటీసీ ఎలిగేటి ఇంద్రసేనా రెడ్డి, పాల్గొన్నారు.