స్థానిక ఎన్నికల్లో యూత్​కాంగ్రెస్ నేతలే కీలకం.. బూత్​స్థాయిలో మరింత బలపడాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

స్థానిక ఎన్నికల్లో యూత్​కాంగ్రెస్ నేతలే కీలకం.. బూత్​స్థాయిలో మరింత బలపడాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

ఎల్బీనగర్/అంబర్​పేట, వెలుగు: బీఆర్ఎస్​పాలనను అంతమొందించడంలో యూత్​కాంగ్రెస్​నేతల పాత్ర మరువలేనిదని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. మంగళవారం ఎల్బీనగర్ లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ సమావేవంలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు.

 మంత్రి పొన్నం  ప్రభాకర్ మాట్లాడుతూ.. యూత్​కాంగ్రెస్​నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి, తర్వాత చట్టసభల్లోకి రావాలని ఆకాంక్షించారు. ఎన్నిక ఏదైనా యూత్​కాంగ్రెస్ పాత్ర ఉండాలన్నారు. విద్యార్థి సంఘం ఎన్నికలు లేకపోతే తాను రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదన్నారు. కష్టపడినవారిని పార్టీ తప్పక గుర్తిస్తుందని మధుయాష్కి చెప్పారు. యూత్​కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు ఉదయభాను, రాజ్యసభ సభ్యుడు అనిల్ అనిల్ యాదవ్, యూత్ కాంగ్రెస్ ఇన్​చార్జి కృష్ణ పాల్గొన్నారు.

 అలాగే అంబర్​పేట శ్రీరామ థియేటర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన అంబేద్కర్​విగ్రహాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం రాత్రి ఆవిష్కరించారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథ్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్, సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.