![కులగణన సర్వే ఫారాలు పంపినం.. వివరాలు ఇవ్వండి: మంత్రి పొన్నం ప్రభాకర్..](https://static.v6velugu.com/uploads/2025/02/minister-ponnam-prabhakar-sends-cast-census-forms-to-kcr-ktr-harish-rao_euCWaK8cXb.jpg)
కులగణన సర్వేపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.. రీసర్వే చేస్తే కేసీఆర్ తో సహా తాను కూడా కులగణన సర్వేలో పాల్గొంటానని అన్నారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం కేటీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు కులగణన సర్వే ఫారాలు పోస్ట్ చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. మొన్నటి సర్వేలో పాల్గొనని మీరు ఇప్పుడు ఈ ఫారాల నింపి పంపాలని కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కోరారు పొన్నం. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు పొన్నం ప్రభాకర్.
తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే మార్గదర్శకంగా కులగణన సర్వే చేపట్టిందని.. ఎవరి లెక్క ఎంతో తేలాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చెప్పారని అన్నారు. రాంగ్ డైరెక్షన్ పోయేలా బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలు ప్రవర్తిస్తున్నాయని.. ఆ రెండు పార్టీలకు కుల గణనపై మాట్లాడే నైతిక అర్హత లేదని మండిపడ్డారు పొన్నం.మొన్నటి సర్వేలో పాల్గొనని కేసిఆర్, కేటీఆర్, హరీష్ రావు కు ఫామ్ లు పంపుతున్నామని అన్నారు.
ప్రణాళిక సంఘం ఆద్వర్యంలో కులగణన సర్వే చేశామని.. ఇప్పుడైనా వివరాలు ఇస్తే.. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు మాట్లాడే అవకాశం ఉంటుందని అన్నారు. సర్వేలో పాల్గొనని వారికి మాట్లాడే హక్కు లేదని అన్నారు పొన్నం. బీజేపీకి చేతనైతే దేశవ్యాప్త సర్వేకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అనుమతి తీసుకోవాలని.. నిర్ణయం నుంచి నివేదిక దాకా నివేదిక నుంచి నిధుల దాకా ఎలా అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.
Also Read : కులగణన సర్వే లెక్కలకు.. ఓటర్ లిస్ట్కు తేడా ఎందుకంటే.?
బీసీలకు న్యాయం చేసేలా కృషి చేస్తున్నామని.. మేధావులు, అన్ని కులాల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తామని అన్నారు.బీసీలలో ముస్లీం మైనారిటీ అనేది ఇప్పుడు కొత్తది కాదని..అర్బన్ నక్సల్స్ పేరుతో ఒక సెక్షన్ క్రిందకు నెట్టవద్దని అన్నారు. ఎర్ర చొక్కా వేసుకున్న వాళ్ళంతా నక్సల్స్ అనడం సరైన పద్దతి కాదని.. ప్రగతిశీల భావాలు కలిగిన తాను నిన్న నామినేషన్ సందర్భంగా ఎర్ర చొక్కా వేసుకున్నానని.. అంతమాత్రాన నేను నక్సలైట్ ను అవుతానా అంటూ ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్.