బీజేపీని వ్యతిరేకించే వారిపై ఈడీ కేసులతో భయపెడుతున్న కేంద్రానికి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై విచారణ చేసే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్, బీజేపీలు రెండు ఒక్కటే కాదా.. అందుకే కేసీఆర్, డైరక్షన్ లోనే రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ను మార్చి కిషన్ రెడ్డిని పెట్టారన్నారని అన్నారు. కేంద్రం తెలంగాణకు ఎం చేసిందో చెప్పిన తర్వాత ఎన్నికల్లో ఓట్లు అడగలని మంత్రి మండిపడ్డారు.
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన 90 రోజుల్లోనే.. 6 గ్యారంటీల్లో చాలా వరకు ప్రజలకు అత్యవసరమయ్యే గ్యారంటీలను అమలు చేశామని, మిగతా గ్యారంటీలను అతి త్వరలోనే అమలు చేస్తామన్నారు. KCR కుటుంబం, BRS నాయకులు 2004 లో ఉన్న ఆస్తులు ఎన్ని.. 2024 లో ఉన్న ఆస్తులెన్ని లెక్క చెప్పాలన్నారు. మెడిగడ్డ బొందలగడ్డ అని.. మమ్మల్ని ఏం పీకడానికి వెళ్లారని కేసీఆర్ బూతులు మాట్లాడారని.. . ఇప్పుడు BRS నాయకులు ఎందుకు వెళ్లారని ఫైర్ అయ్యారు. ఒకప్పుడు మానస పుత్రిక అన్న ప్రాజెక్ట్ ఇప్పుడు బొందలగడ్డ ఎలా అయ్యిందని దుయ్యబట్టారు.