నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్​

నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలి : మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ,(హుస్నాబాద్) వెలుగు: నేరస్తుల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించి బాధితులకు న్యాయం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ సూచించారు. మంగళవారం హుస్నాబాద్​లో కొత్తగా నిర్మించిన ఏసీపీ ఆఫీస్​ను ఐజీ రమేశ్​రెడ్డి, కలెక్టర్​మనుచౌదరి, సీపీ అనురాధతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రెండ్లీ పోలీసింగ్​నేరస్తులకు వర్తించదన్నారు.

బాధితులు ఏ సమస్య ఉన్నా నేరుగా పోలీసులకు చెప్పుకొని న్యాయం పొందే విధంగా పోలీసులు వ్యవహరించాలన్నారు. అంతకు ముందు అక్కన్నపేటలో నిర్వహించిన నేత్ర వైద్య శిబిరాన్ని సందర్శించారు. కంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం బస్వాపూర్​ లోని  ప్రభుత్వ స్కూల్​లో కంప్యూటర్​ ల్యాబ్‌ను ప్రారంభించారు.

స్టూడెంట్స్​కష్టపడి చదువుకుంటే ఉజ్వల భవిష్యత్​ఉంటుందన్నారు. ప్రైవేట్​స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ స్కూళ్లల్లో సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు .గ్రామంలోకి ప్రైవేట్ స్కూల్​బస్సులు రాకుండా పిల్లలందరినీ ప్రభుత్వ స్కూళ్లలోనే చేర్పించేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ లింగమూర్తి, ఆర్డీవో రామూర్తి, ఏసీపీ సతీశ్, సింగిల్​విండో చైర్మన్ శివ్వయ్య, డీఈవో శ్రీనివాస్​రెడ్డి, డీఎంహెచ్​వో పల్వాన్, డీపీవో దేవకి దేవి పాల్గొన్నారు.