రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించాలి : పొన్నం ప్రభాకర్​

రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించాలి : పొన్నం ప్రభాకర్​

చిగురుమామిడి, వెలుగు: ఆధునిక వ్యవసాయ మెలకువలు తెలుసుకుని రైతులు ఆర్థిక అభివృద్ధి సాధించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్​సూచించారు. కరీంనగర్​ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి, ముదిమానిక్యం, ముల్కనూర్​ గ్రామాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. ఆయా రైతుల వేదికల్లో వ్యవసాయ అనుబంధ రంగాల ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. తొలుత ఇందుర్తి బస్ స్టాప్ చౌరస్తా నుంచి రైతు వేదిక వరకు బైక్ పై ఆయన ర్యాలీగా వెళ్లారు. గ్రామంలో స్వచ్ఛదనం  పచ్చదనంలో భాగంగా మొక్కలు నాటారు. 

పాడి పశు పోషణ పట్ల రైతులు ఆసక్తి పెంచుకోవాలన్నారు. రొటీన్​ గా పండించే వరి, మొక్కజొన్న, పత్తి కాకుండా రెట్టింపు ఆదాయం వచ్చే పంటలు వేయాలని సలహా ఇచ్చారు. రుణమాఫీ రాని రైతులు ఆందోళన చెందకుండా వ్యవసాయ అధికారులకు వివరాలు ఇవ్వాలన్నారు. మహిళలు స్త్రీ శక్తి పథకాలను ఉపయోగించుకొని ఆర్థిక వృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు. ఉపాధి హామీలో  పంట పొలాల చదును చేసి రోడ్లు వేసుకోవడానికి ఆలోచించాలన్నారు. సమావేశంలో కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ లక్ష్మి కిరణ్ , ఆర్డీవో మహేశ్, వివిధ విబాగాల మండల, జిల్లా స్థాయి అధికారులు, రైతులు 

పాల్గొన్నారు.