అన్ని గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు : పొన్నం ప్రభాకర్​

అన్ని గ్రామాల్లో స్టీల్ బ్యాంకులు :  పొన్నం ప్రభాకర్​

కోహెడ, వెలుగు: సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్​సూచించారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్ లో​ హెల్త్​ సెంటర్​ను కలెక్టర్​ మను చౌదరితో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది సూచనలను ప్రజలు పాటించాలన్నారు. నియోజకవర్గంలోని 30 మేజర్​ గ్రామ పంచాయతీల్లో ప్రైమరీ హెల్త్​ సెంటర్​లు, ఓపెన్​ జిమ్​లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్లాస్టిక్​వాడకం తగ్గించడంలో భాగంగా  నియోజకవర్గంలోని 100 శాతం గ్రామాల్లో 500 మంది ఓకే సారి తినే విధంగా స్టీల్ బ్యాంకులు​ ఏర్పాటు చేస్తామన్నారు. వీటి మెయింటనెన్స్​ను మహిళ సంఘాలకు అప్పగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో శ్రీనివాస్, మెడికల్​ ఆఫీసర్​ నిమ్రా ఉన్నారు.

సాయుధ పోరాటంలో మల్లేశం పాత్ర మరువలేనిది

హుస్నాబాద్: తెలంగాణ సాయుధ పోరాటంలో మేర మల్లేశం పాత్ర మరువలేనిదని మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. పరిశోధక సంపాదకుడు, కవి అన్నవరం దేవేందర్ రాసిన ‘మేర మల్లేశం’ పుస్తకాన్ని హుస్నాబాద్​లోని తన క్యాంపు ఆఫీసులో మంత్రి బుధవారం ఆవిష్కరించారు. రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో మేర మల్లేశం రాసి, పాడిన పాటలు ప్రజల్లో ఎంతో చైతన్యాన్ని తెచ్చాయన్నారు. ఆయన జీవితం నేటి తరాలకు ఆదర్శమన్నారు.