- గ్రేటర్ వ్యాప్తంగా విరివిగా ఇంకుడు గుంతలు తవ్వించాలి
- ఉన్నతాధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన
హైదరాబాద్‌సిటీ, వెలుగు: గ్రేటర్‌పరిధిలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్సూచించారు. వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి గ్రౌండ్వాటర్లెవల్స్పెంచాలని చెప్పారు. మంగళవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిశోర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్ రెడ్డి, కమిషనర్ ఆమ్రపాలి, వాటర్‌బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి, కలెక్టర్అనుదీప్, జోనల్ కమిషనర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
భూగర్భ జలాలను విరివిగా ఇంకుడు గుంతలను తవ్వించాలని సూచించారు. ఇంజెక్షన్ వెల్స్ నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. 150 వార్డుల కార్పొరేటర్ల భాగస్వామ్యంతో ఇంకుడు గుంతల ఏర్పాటుకు స్పెషల్ డ్రైవ్ చేపడతామని వివరించారు. కమిషనర్ ఆమ్రపాలి మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ఇంకుడు గుంతల నిర్మాణంపై చెన్నైకి చెందిన జియాలజిస్టు శక్తివేల్పవర్పాయింట్ప్రజెంటేషన్ ఇచ్చారు. వాటర్‌బోర్డు 90 రోజుల స్పెషల్ డ్రైవ్‌ను దాన కిశోర్ ప్రశంసించారు.