- మేయర్‌తో కలిసి హెలికాప్టర్లో పర్యటించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, వెలుగు:హుస్సేన్‌సాగర్‌లో గణనాథుల నిమజ్జనాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఏరియల్ వ్యూ ద్వారా పర్యవేక్షించారు. మేయర్ విజయలక్ష్మి, డీజీపీ జితేందర్, సీపీ సీవీ ఆనంద్, హైదరాబాద్ కలెక్టర్ దురిశెట్టి అనుదీప్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో కలిసి పొన్నం హెలికాప్టర్లో పర్యటించారు. ఎన్టీఆర్మార్గ్, నెక్లెస్ రోడ్స్ సహా హుస్సేన్‌సాగర్ పరిసర ప్రాంతాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. గణేశ్విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.