దత్తాత్రేయ ఆలయం డెవలప్ చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్

దత్తాత్రేయ ఆలయం డెవలప్ చేస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్
  • ప్రత్యేక పూజలు చేసిన పొన్నం దంపతులు  

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి లో మిడ్ మానేర్ బ్యాక్ వాటర్ లో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ అభివృద్ధి కి కృషి చేస్తానని రాష్ట్ర రవాణ, బీసీ సంక్షేమ శాఖ  మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం శ్రీ దత్తాత్రేయ స్వామి 44 వ జయంతి సందర్భంగా మంత్రి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ఆలయం మిడ్ మానేర్ నీళ్లల్లో ఉండటంతో ఆలయానికి వెళ్లేందుకు బ్రిడ్జి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు.

 ప్రస్తుతానికి ప్రత్యేక బోట్లను ఏర్పాటు చేసి భక్తులను ఆలయానికి తరలిస్తున్నామని అన్నారు.  ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పూజలు చేశారు. ఆలయానికి  బోటులో వెళ్లేందుకు భక్తులు భారీ ఎత్తున తరలి వచ్చారు. దీంతో బోటు వద్ద గందరగోళం చోటు చేసుకుంది. కాగా భక్తులకు మంచి నీటి సౌకర్యం కల్పించాలని ఆలయ నిర్వాహకులకు మంత్రి సూచించారు సీఐ శ్రీనివాస్, ఎస్ఐ పృథ్వీధర్ గౌడ్ ఎలాంటి  సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ నారాయణ రెడ్డి, ఎంపీడీవో జయశీల తదితరులు పాల్గొన్నారు.