రాజ్యాంగ రక్షణకు ముందుకు రావాలి :  మంత్రి పొన్నం ప్రభాకర్​

రాజ్యాంగ రక్షణకు ముందుకు రావాలి :  మంత్రి పొన్నం ప్రభాకర్​

కోహెడ, వెలుగు: రాజ్యాంగ రక్షణకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం కోహెడ మండలంలోని సీసీపల్లిలో నిర్వహించిన జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. బీజేపీ పదేళ్లుగా దేశంలో ప్రజాస్వామ్యమనేదే లేకుండా నియంత పాలిస్తోందని మండిపడ్డారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్​యాత్రను ప్రజాస్వామ్యాన్ని రక్షించే ఉద్ధేశంతో చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఏఎంసీ చైర్ పర్సన్​ నిర్మల, వైస్​ చైర్మెన్​ తిరుపతిరెడ్డి, కాంగ్రెస్​మండల అధ్యక్షుడు ధర్మయ్య, నాయకులు శెట్టి సుధాకర్, జయరాజ్, రవీందర్ తదితరులున్నారు.

మోడల్​స్కూల్లో గాంధీ విగ్రహం ఆవిష్కరణ 

కోహెడ మండలంలోని నాగసముద్రాల మోడల్ స్కూల్లో మహాత్మా గాంధీ విగ్రహాన్ని మంత్రి ప్రభాకర్​కలెక్టర్ మను చౌదరితో కలిసి ఆవిష్కరించారు. స్కూల్లో  మినరల్ వాటర్ ప్లాంట్​ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. నేషనల్​వాలీబాల్ పోటీలకు ఎంపికైన స్టూడెంట్స్ ను అభినందించారు. తాను ఎంపీగా 29 మోడల్ స్కూల్స్ తెచ్చానని గుర్తు చేశారు. టీచర్లకు ప్రమోషన్​ ఇచ్చి, బదిలీలు చేపట్టామన్నారు.

అనంతరం హుస్నాబాద్​బాలికల హైస్కూల్​వార్షికోత్సవానికి హాజరయ్యారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ సుధాకర్​రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్​ లింగమూర్తి, ఆర్డీవో రామ్మూర్తి, మున్సిపల్ మాజీ చైర్​పర్సన్​రజిత తదితరులున్నారు.

రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న కేంద్రం

చేర్యాల, వెలుగు:  కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవహేళన చేస్తోందని జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్​రెడ్డి అన్నారు. శుక్రవారం చేర్యాల మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో చేర్యాల, కొమురవెల్లి మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు.  జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ యాత్రపై చర్చించారు. శనివారం నుంచి గ్రామాల్లో పాదయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.

మద్దూరు, దూల్మిట్ట మండల కేంద్రాల్లో పార్టీ మండలాల అధ్యక్షులు మేక మల్లేశం, కోల సాయిలు గౌడ్​ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు జరిగాయి.  చేర్యాల, కొమురవెల్లి మండలాల అధ్యక్షులు కొమ్ము రవి, ఎం. శ్రీనివాస్, మార్కెట్​కమిటీ వైస్​చైర్మన్ జీవన్​రెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్ కృష్ణ గౌడ్, నాయకులు సుదర్శన్​ రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.