దేవుని దగ్గర రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హనుమకొండ జిల్లా కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు మంత్రి. ఆలయంలోని వీరభద్రస్వామి గుమ్మడికాయలు ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి. కార్యక్రమంలో స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పాల్గొన్నారు.
ఆలయాల్లో అధికార పక్షం, ప్రతిపక్షం అంటూ తేడా ఉండదని.. దేవుని ముందు అంతా సమానమేనని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.
కొత్త కొండకొస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. భక్తులకు త్వరగా దైవదర్శనం చేసుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం ప్రభాకర్.