ముగిసిన వీరభద్ర స్వామి ఉత్సవాలు

  • స్వామి వారిని దర్శించుకున్న మంత్రి 

కోహెడ, వెలుగు: మండలంలోని సముద్రాల గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న వీరభద్ర స్వామి ఉత్సవాలు ముగిశాయి. మంగళవారం తెల్లవారు జామున ఆలయ అవరణలో ఏర్పాటు చేసిన అగ్ని గుండాలను దాటుతు భక్తులు తమ మొక్కులను తీర్చుకున్నారు.   ఈ సందర్బంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.  మంత్రి పొన్నం ప్రభాకర్​ మంగళవారం స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. 

ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.మంత్రిని సన్మానించి స్వామి వారి చిత్ర పటాన్ని అందజేశారు. హుస్నాబాద్​లో అయ్యప్ప స్వామి ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్​ చైర్​ పర్సన్​ రజిత,మండల అద్యక్షుడు ధర్మయ్య,ఆలయ అర్చకుడు శాంతయ్య స్వామి,ప్రశాంత్​,స్థానిక నాయకులు ఉన్నారు.