వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

 వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి పొన్నం ప్రభాకర్‌

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతర సందర్భంగా ఈనెల 25న రాత్రి 7గంటలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించనునట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాత్రి7.30 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టు వస్త్రాల సమర్పిస్తారు.  రాత్రి 9 గంటల నుంచి భక్తులకు లఘు దర్శనం, కోడె మొక్కులు కొనసాగుతాయి.  

మహాశివరాత్రి 26న రాత్రి 11 గంటల నుంచి 1.30 వరకు పుర: జనులకు సర్వదర్శనం, తెల్లవారుజామున 1.30 గంటల నుంచి 2.30 గంటల వరకు దాతలు, స్థానిక అధికారులకు, మీడియాకు దర్శనం, ఉదయం 3.30 నుంచి 3.40 గంటల వరకు ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు,  ఉదయం 3.40 నిమిషాల నుంచి 4.23 గంటల వరకు సుప్రభాతం ఉదయం 4.30 నుంచి 6 గంటల వరకు ప్రాతకాల పూజ, అనువంశిక అర్చకుల దర్శనం, సాయంత్రం 6 గంటల 5 నిమిషాల నుంచి  స్వామివారి కల్యాణ మండపంలో అనువంశిక అర్చకులచే మహాలింగార్చన, రాత్రి 11.35 నిమిషాలకు లింగోద్భావ కాలంలో స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు.