ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.. బీఆర్ఎస్ నేతలకు పొన్నం వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి.. బీఆర్ఎస్ నేతలకు పొన్నం వార్నింగ్

బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీఆర్ఎస్ నేతలు ప్రాంతీయ విభేదాలు  రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్  కూడా ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టారు..హైదరాబాద్ లో ఎవరైనా ఉండొచ్చని కేసీఆర్ గతంలో  చెప్పారన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తే ఊరుకోబోమన్నారు. ప్రభుత్వం, సీఎంపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడమేంటని ప్రశ్నించారు

 బీఆర్ఎస్ ఆగమైందని సొంత పార్టీ నేతలే అన్నారన్నారు పొన్నం చెప్పారు.  పార్టీ ఫిరాయింపుల పేటెంట్ ముమ్మాటికీ బీఆర్ఎస్ దేనన్నారు . రాజకీయ పునరేకీకరణ పేరుతో కేసీఆర్  ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. తాము పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదన్నారు. దళిత లీడర్ సీఎల్పీగా ఉంటే కేసీఆర్ ఓర్వేలేకపోయారని విమర్శించారు.

 ప్రభుత్వాన్ని పడగొడతాతమని బీఆర్ఎస్, బీజేపీ నేతలు  అన్నారు... ఇపుడు  అసెంబ్లీకి రాకుండా మొహం చాటేస్తున్నారని విమర్శించారు పొన్నం. కూలగొడతామని మాట్లాడితే ఊరుకోమన్నారు.  పూలే పేరు పెట్టుకున్నా ప్రజాపాలన అందిస్తున్నామని చెప్పారు పొన్నం. ప్రజాప్రతినిధుల ఇండ్లపై దాడులు మంచివికావన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.