- నీటి వనరులను రక్షించుకునేందుకు ప్రజలు సహకరించాలి
- రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
కరీంనగర్, వెలుగు : పేదలు, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, నాలాలను ఎవరు ఆక్రమించినా పార్టీలకతీతంగా చర్యలు తీసుకుంటామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదుపైనా ఆఫీసర్లు స్పందిస్తారని, అలా జరగకుంటే ప్రజలు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ అర్బన్
సబ్ అర్బన్ ఏరియాల్లో ఆక్రమణలనుతమ దృష్టికి తీసుకొచ్చే చర్యలు తీసుకుంటామని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు చేపట్టారన్నారు. డ్రగ్స్, గంజాయి రవాణా చేసే వారిపై పీడీ యాక్ట్ నమ౪దు చేస్తామని హెచ్చరించారు. స్పోర్ట్స్ స్కూల్‌లో అన్ని సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ స్కూల్‌కు ప్రభుత్వం నుంచి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ పాల్గొన్నారు.
రూ.5 వేల కోట్లతో 30 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు
హుస్నాబాద్, వెలుగు : రాష్ట్రంలోని 30 నియోజకవర్గాల్లో రూ.5 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నట్లు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఒక్కో స్కూలను 25 ఎకరాల విస్తీర్ణంలో, అధునాతన హంగులతో నిర్మిస్తామన్నారు. అలాగే రూ.11వేల కోట్లతో 25 వేల ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గురువారం విద్యాశాఖ అధికారులతో నిర్వహించిన రివ్యూలో మంత్రి మాట్లాడారు. మానవ వనరుల ఉత్పత్తి, ఉన్నత సమాజ నిర్మాణమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని
ఇందులో భాగంగానే విద్యారంగాన్ని డెవలప్ చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ఇండిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం కొడంగల్, వైరా, హుస్నాబాద్ నియోజకవర్గంలో స్థలాలను కూడా చూశామన్నారు. ఎన్నో ఏండ్ల నుంచి స్కూళ్లలో వేధిస్తున్న సమస్యలను ఏడు నెలల్లోనే పరిష్కరించామన్నారు. స్కూళ్లలో స్టూడెంట్ల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, హుస్నాబాద్ ఆర్డీవో రామ్మూర్తి, ఏసీపీ సతీశ్, మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకుల రజిత, తహసీల్దార్ రవీందర్‌రెడ్డి, సిద్దిపేట, కరీంనగర్,హనుమకొండ డీఈవోలు శ్రీనివాస్‌రెడ్డి, జనార్దన్‌రావు, వాసంతి పాల్గొన్నారు.