కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తాం  : పొన్నం ప్రభాకర్

  • రూ.150కోట్లతో మెడికల్ కాలేజీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు శంకుస్థాపన

కొత్తపల్లి/గంగాధర, వెలుగు : కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అన్నిరంగాల్లో అగ్రభాగాన నిలుపుతామని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  పేర్కొన్నారు. శుక్రవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా కొత్తపల్లి పట్టణంలోని మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలేజీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిర్మాణ పనులకు కలెక్టర్​ పమేలా సత్పతితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.150కోట్లతో నిర్మిస్తున్న కాలేజీ బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అన్ని రకాలు వసతులు కల్పిస్తామన్నారు.  ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేల సహకారంతో కరీంనగర్ జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. గతంలో జిల్లా కేంద్రంలో మెడికల్​ కాలేజీ మంజూరు చేయాలని పోరాటం చేశానని గుర్తుచేశారు. రాజకీయాలకతీతంగా మెడికల్ కాలేజీని అద్భుతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.  అనంతరం ఖాజీపూర్​లో కొత్తగా నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్​స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించారు. 

నారాయణపూర్ కాలువ పనులు పూర్తిచేయిస్తా..

నారాయణపూర్ రిజర్వాయర్ కుడి కాలువ పనులు పూర్తి చేయించి రైతుల సాగునీటి ఇబ్బందులను తీరుస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. గంగాధర మండలం ఉప్పరమల్యాలలో రూ.1.76 కోట్లతో చేపట్టనున్న 33/11 కేవీ సబ్​స్టేషన్​ నిర్మాణ పనులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నారాయణపూర్ ప్రాజెక్టు కాలువ పనులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, త్వరలోనే కాలువ పనులు ప్రారంభించి రైతుల సాగునీటి కష్టాలను తీరుస్తామన్నారు.

ఆయా కార్యక్రమాల్లో  చొప్పదండి, మానకొండూరు ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, డా.కవ్వంపల్లి సత్యనారాయణ, జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ కనుమల్ల విజయ, కొత్తపల్లి మున్సిపల్​చైర్మన్ రుద్ర రాజు, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో సుజాత, కాలేజీ ప్రిన్సిపాల్​ లక్ష్మీనారాయణ, ఆర్డీవో కె.మహేశ్వర్, ఎంపీపీ పిల్లి శ్రీలత-, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ గంగాధర్, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

కరీంనగర్ సిటీ, వెలుగు:  బలహీన వర్గాలకు న్యాయం జరిగేల కాంగ్రెస్  ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం  సిటీలోని ఇందిరా గార్డెన్స్ లో  బీసీ కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ కులాల ప్రతినిధులు మంత్రికి ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బలహీనవర్గాల బిడ్డగా కుల వృత్తులు మరింత అభివృద్ధి చెందడానికి  కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు.  గతంలో ఉన్న కార్పొరేషన్లు యథావిధిగా కొనసాగుతాయని, వాటిపై అపోహలు వద్దని స్పష్టం చేశారు. బీసీ కుల సంఘాల ఐక్యవేదిక ఆహ్వాన కమిటీ కన్వీనర్ వైద్యుల అంజన్ కుమార్,  ప్రతినిధులు కిరణ్ కుమార్, కేశిపెద్ది శ్రీధర్ రాజు, మెతుకు సత్యం, మోహనచారి, శ్రీనివాస్, వీర దేవేందర్ పాల్గొన్నారు.