కరీంనగర్ : కేంద్ర మంత్రి బండి సంజయ్ కి తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ లేఖ రాశారు. కేంద్ర క్యాబినేట్ లో మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు పొన్నం హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి, ప్రత్యేకంగా కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ కు 2024- - 25 ఆర్థిక సంవత్సరానికి వచ్చే బడ్జెట్ సెషన్‌లో తగినంత బడ్జెట్ కేటాయింపులు జరిగేలా చూడాలని కోరారు. తెలంగాణ అభివృద్ధికి, కేంద్ర నిధులు మంజూరుకి కృషి చేయాలని బండి సంజయ్ ని కోరారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు ఇచ్చిన హామీలు, వాగ్దానాలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వ నిబద్ధతగా వ్యవహరించాలని సూచించారు మంత్రి పొన్నం. బహిరంగ లేఖలో ఈ కింది అంశాల ఏర్పాటుకు కృషి చేయాలని విన్నమించారు.
1. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు
2. మిడ్ మానేరు, గౌరవెల్లి ప్రాజెక్ట్ భూనిర్వాసిత భాదిత కుటుంబాలకు సూక్ష్మ ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన
3. శాతవాహన విశ్వవిద్యాలయానికి 200 కోట్ల ఆర్థిక సహాయం అందించడం
4. కరీంనగర్ మరియు తిరుపతి మధ్య రైల్వే మార్గం డబ్లింగ్ వేగవంతం చేయడం
5. కరీంనగర్ మరియు షిర్డీ మధ్య రైల్వే మార్గం డబ్లింగ్‌ను వేగవంతం చేయడం
6.హుస్నాబాద్‌లో మెడికల్ కాలేజీ మంజూరు
7..కొత్తపల్లి నుండి జనగాం జాతీయ రహదారి మంజూరు
8. సిరిసిల్ల టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధికి నిధులు
9..వేములవాడ, కొండగట్టు ఆలయాల అభివృద్ధికి నిధులు
10. NLM, PMEG మరియు NHM పథకాల కింద తగినంత బడ్జెట్ కేటాయింపు.