అలాంటి తప్పులు మళ్లీ రిపీట్ కావొద్దని భూ భారతి: మంత్రి పొన్నం

అలాంటి తప్పులు మళ్లీ రిపీట్ కావొద్దని భూ భారతి: మంత్రి పొన్నం

సిద్దిపేట: గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా చాలా మంది రైతులకు నష్టం జరిగిందని.. అలాంటి తప్పులు మళ్లీ జరగొద్దనే రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో భూ భారతి తీసుకొచ్చామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందులో భాగంగానే భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. గురువారం (ఏప్రిల్ 24) సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో భూ భారతి చట్టంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం చీఫ్ గెస్ట్‎గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమి అంటేనే ఆత్మగౌరవం. అలాంటి భూమి వివాదాల్లో ఉండకుండా సమస్యల పరిష్కారం కోసం భూ భారతి చట్టం తీసుకొచ్చామని, రైతులకు భూ భారతి ఎంతగానో ఉపయోగ పడుతోందన్నారు. 

ధరణిలో 30 లక్షల మంది భూ సమస్య ఉందని పిటిషన్ పెట్టుకున్నారు. ఆ సమస్యలు భూ భారతి ద్వారా పరిష్కారం అవుతాయన్నారు.  త్వరలోనే గౌరవెల్లి కాలువల నిర్మాణం పూర్తవుతుందని.. ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్ట్ భూ సేకరణ సమయంలో కొంత మంది రైతులకు నష్టం జరిగిన వారిని ఆదుకుంటామని భరోసా కల్పించారు.