హైదరాబాద్: అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని.. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో రేషన్ కార్డుల ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల సర్వేపై జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం (జనవరి 20) అధికారులతో హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేషన్ కార్డుల ముసాయిదా లిస్ట్‌లో పేర్లు లేని వారు అధైర్య పడాల్సిన అవసరం లేదని.. రేషన్ కార్డులకు సంబంధించిన సర్వే, కొత్త కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని క్లారిటీ ఇచ్చారు. అర్హులందరికీ రేషన్ కార్డులతో పాటు ఇందిరమ్మ ఇల్లు కూడా అందుతాయని..
Also Read : విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన పెంచుకోవాలి
ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కేవలం స్థలం ఉన్న వారికే అనే అపోహలు నమ్మొద్దని.. స్థలాలు లేని వారికి కూడా ఎలా ఇవ్వాలనే ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలిపారు. రేషన్ కార్డుల్లో కొత్త పేర్లు చేర్చడానికి కూడా అవకాశం కల్పిస్తామని.. పాత కార్డులు తీసేయడం ఉండదని చెప్పారు.