రూల్స్ పాటించకుంటే లైసెన్స్ రద్దు : వాళ్ల పేరుతో నో రిజిస్ట్రేషన్స్

రూల్స్ పాటించకుంటే లైసెన్స్ రద్దు : వాళ్ల పేరుతో నో రిజిస్ట్రేషన్స్

హైదరాబాద్: నిబంధనలు పాటించకుండా వాహనాలు నడిపే వాళ్ల డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేస్తామని, వాళ్ల పేరిట భవిష్యత్తులో వాహనాలు రిజిస్ట్రేషన్స్ ఉండకుండా చేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇప్పటికే ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన 8వేల మంది లైసెన్సులు రద్దు చేశామని చెప్పారు. కేంద్రం పరిధిలో ఉన్న సారథి వాహన్ పోర్టల్‎లో తెలంగాణ చేరబోతోందని అన్నారు. ఇవాళ మంత్రి పొన్నం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టామని చెప్పారు.

ALSO READ | ఆర్వోఆర్ చట్టంపై ప్రజాభిప్రాయ సేకరణ

యాక్సిడెంట్ జోన్లను గుర్తిస్తామని, పాఠశాలల్లో పిల్లలకు అవగాహన కల్పించేందుకు రోడ్డు భద్రతా వారోత్సవాలను వచ్చే నెలలో నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలో వెహికిల్ స్క్రాపింగ్ పాలసీ తీసుకురానున్నామని అన్నారు. కర్నాటక, మహారాష్ట్ర విధానాలను అధ్యయనం చేసిన తర్వాత పాలసీని రాష్ట్రంలో అమలు చేస్తామని వివరించారు.  15 ఏండ్లు పైబడిన వాహనాలపై అదనపు ట్యాక్సీ విధించి అనుమతిస్తామని చెప్పారు. ఆర్టీసీలో పదిహేనేళ్లు దాటిన వాహనాలు లేవని మంత్రి క్లారిటీ ఇచ్చారు. సింగిల్ పర్మిల్ విధానంపై దక్షిణాది రాష్ట్రాల సమావేశం త్వరలోనే ఉంటుందని అన్నారు.