గణేష్ ఉత్సవాల సందర్భంగా మెట్రో ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంచేలా చూస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్,రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి ప్రతిష్ఠ పెంచే విధంగా గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. గణేష్ ఉత్సవాలు ఘనంగా చెయ్యాలంటే,ప్రజల సహకారం చాలా అవసరమన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీసేవిధంగా ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గణేష్ మండలపాలను ముఖ్యమంత్రితో సహా మంత్రులు సందర్శించి,వినాయక ఆశీస్సులు తీసుకుంటారని చెప్పారు. ప్రజలు గణేష్ నిమజ్జనం చూడటానికి వస్తారు కాబట్టి ట్రాన్స్ ఫోర్ట్,మెట్రో,ఎంఎంటీఎస్ ను అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను అదేశించారు.
Also Read :- ఇంజనీర్లపై కాళేశ్వరం కమిషన్ సీరియస్
ఒక్క రోజే గణేష్ నిమర్జనం పూర్తి చెయ్యాలని భాగ్య నగర గణేష్ ఉత్సవ్ సభ్యులను కోరారు మంత్రి పొన్నం. గత ఏడాది కంటే 20 శాతం ఎక్కువ వినాయకుల విగ్రహాలు ప్రతిష్టించి అవకాశం ఉందన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని.. అందరు మట్టి విగ్రహాలు ప్రతిష్టించాలని కోరారు. రోడ్లు పాడైన చోట బాగు చేస్తామన్నారు. అన్ని విభాగాలను సమన్వయంతో మట్టి విగ్రహాలపై అవగాహన కలిపిస్తామన్నారు పొన్నం.