
పెద్దపల్లి, వెలుగు : సీపీఐ నేత, రాష్ట్ర గౌడ జన హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు, భూ పోరాట యోధుడు బుర్ర కొండయ్యగౌడ్ చిత్రపటానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళి అర్పించారు. కొండయ్యగౌడ్ ఇటీవల చనిపోగా పెద్దపల్లి జిల్లాఎలిగేడులోని ఆయన ఇంటికి వెళ్లి ఫొటోకు వద్ద పూలు చల్లి నివాళి ప్రకటించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.