అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కవి, గాయకుడు జయరాజ్ ను పరామర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జయరాజ్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. జయరాజ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మంత్రి.
జూలై 19 ఉదయం 11 గంటలకు జయరాజ్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్పంజాగుట్టలోని నిమ్స్ హాస్పిటల్లో చేర్పించారు. నిమ్స్డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పర్యవేక్షణలో మెట్టు రంగారెడ్డి వార్డులో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు.