ఆఫీసర్లు సెలవులు తీసుకోవద్దు : మంత్రి ప్రశాంత్​రెడ్డి

నిజామాబాద్, వెలుగు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికార యంత్రాంగం సెలవులు తీసుకోవడానికి వీలులేదని మంత్రి ప్రశాంత్​రెడ్డి ఆదేశించారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అలర్ట్​గా ఉండాలన్నారు. మంగళవారం కలెక్టరేట్​లో జిల్లా ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. పాత ఇండ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన వసతి కల్పించాలన్నారు. ​ట్రాన్స్ ఫారాల వల్ల ప్రమాదం జరగకుండా చూడాలన్నారు. వర్షాలు తగ్గాక పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించాలన్నారు.

ALSO READ :ఇంటర్ స్పాట్ డీఏ ఇవ్వాలి.. విద్యాశాఖ సెక్రటరీకి టీపీటీఎల్ఎఫ్ వినతి

కలెక్టరేట్​లో100కు డయల్​చేసి అత్యవసర సహాయాన్ని పొందాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా పీహెచ్​సీలు 24 గంటలు పనిచేయాలని, అవసరమైన మెడిసిన్స్​అందుబాటులో పెట్టాలన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, అడిషనల్ కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, మున్సిపల్​కార్పొరేషన్​కమిషనర్ మంద మకరంద్, ఆఫీసర్లు ఉన్నారు.