నిజామాబాద్, వెలుగు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికార యంత్రాంగం సెలవులు తీసుకోవడానికి వీలులేదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అలర్ట్‌గా ఉండాలన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. పాత ఇండ్లలో ఉంటున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన వసతి కల్పించాలన్నారు. ట్రాన్స్ ఫారాల వల్ల ప్రమాదం జరగకుండా చూడాలన్నారు. వర్షాలు తగ్గాక పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్ధారించాలన్నారు.
ALSO READ :ఇంటర్ స్పాట్ డీఏ ఇవ్వాలి.. విద్యాశాఖ సెక్రటరీకి టీపీటీఎల్ఎఫ్ వినతి
కలెక్టరేట్లో100కు డయల్‌చేసి అత్యవసర సహాయాన్ని పొందాలన్నారు. వ్యాధులు ప్రబలకుండా పీహెచ్‌సీలు 24 గంటలు పనిచేయాలని, అవసరమైన మెడిసిన్స్అందుబాటులో పెట్టాలన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, అడిషనల్ కలెక్టర్లు చిత్రామిశ్రా, యాదిరెడ్డి, మున్సిపల్కార్పొరేషన్కమిషనర్ మంద మకరంద్, ఆఫీసర్లు ఉన్నారు.