రాజకీయాల్లో పొంగులేటి బచ్చాగాడు : మంత్రి పువ్వాడ అజయ్

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనపై చేసిన కామెంట్స్ కు మంత్రి పువ్వాడ అజయ్ కౌంటర్ ఇచ్చారు.  రాజకీయాల్లో పొంగులేటి బచ్చాగాడు అని, పిట్టల దొర  అంటూ విమర్శించారు.  ఆత్మీయ సమావేశానికి జనాలు రాకపోవడంతో  ఫస్ట్రేషన్ లో ఏదేదో మాట్లాడుతున్నాడని అన్నారు.  ఎంపీగా ఖమ్మం జిల్లాకు పొంగులేటి చేసింది శూన్యమని చెప్పుకొచ్చారు.  

2016 లో టీఆర్ఎస్ లో రాకముందు పొంగులేటి  ఆర్ధిక స్థితికి నేటి స్థితికి తేడా చూడాలన్నారు మంత్రి పువ్వాడ.  కాంట్రాక్టుల్లో చేసిన మోసాలపై పొంగులేటి  సొంత సోదరుడే ఫిర్యాదు చేసాడన్నారు. జైల్‌కు వెళ్తాననే భయంతోనే  పొంగులేటి   రాజకీయాల్లో వచ్చారని పువ్వాడ ఆరోపించారు. టీఆర్ఎస్ లో ఉండి టీఆర్ఎస్ ను పొంగులేటి  ఓడించాడని .. వైరా టీఆర్ఎస్ ఎస్టీ అభ్యర్థి ఓటమికి పొంగులేటినే కారణమని అన్నారు.  

పొంగులేటి  సొంత పార్టీ వారిని మోసం చేసిన విధానాన్ని చూసి సీఎం కేసిఆర్ అయన్ను వదిలించుకున్నాడని  మంత్రి పువ్వాడ చెప్పారు.  పొంగులేటి చరిత్రను బయటకు లాగుతామని, రోడ్డు మీద తరిమి తరిమి కొడతామని  హెచ్చరించారు.  ఆడబిడ్డల ఆశీర్వాదం ఉన్నంత వరకు తనకు ఏమీ కాదని,  ఈ రోజు సర్కార్ దవాఖానాలు పేదలతో పాటు ఉన్నత వర్గాలు కూడా వెళ్లే విధంగా ఉన్నాయని పువ్వాడ చెప్పుకొచ్చారు.