ఖమ్మంలో ఓ పనికి మాలిన బ్యాచ్ ఉంది : పువ్వాడ అజయ్

ఖమ్మం జిల్లాలో పనికిమాలిన బ్యాచ్ ఉందని, వాళ్లకు అబద్దాలు చెప్పడం తప్ప ఏమీ తెలియదని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన తనపై కొందరు విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో గలగలా నీళ్లు పారేలా చేసిన ఘనత తన సొంతమని అన్నారు.  ఖమ్మంలో బీఆర్ఎస్ సభకు సంబంధించిన ఏర్పాట్లు పరిశీలించిన ఆయన ఈ కామెంట్లు చేశారు.  

బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉండాలని మంత్రి పువ్వాడ సూచించారు. రాష్ట్రంలో 33 జిల్లాలున్నా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించే అదృష్టం ఖమ్మం జిల్లాకే దక్కిందని అన్నారు.  ఖమ్మం జిల్లాపై, ఇక్కడి  ప్రజలపై సీఎం కేసీఆర్ కు ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవాలని చెప్పారు. బంగారు అవకాశాన్ని అందిపుచ్చుకుని బీఆర్ఎస్ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.