మా స్కీములనే కాంగ్రెస్​కాపీ కొట్టింది: పువ్వాడ

ఖమ్మం: బీఆర్ఎస్​ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీములనే కాంగ్రెస్​కాపీ కొట్టిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘మా స్కీమ్‌లను కాంగ్రెస్ కాపీ కొట్టింది. రివర్స్‌గా మేమే కాంగ్రెస్ పథకాలను కాపీ కొడుతున్నారని కొత్త డ్రామాలాడుతున్నారు. అంతే కాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం తమ పథకాలను కాపీ కొట్టింది. మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీనే. బీఆర్‌ఎస్ విడుదల చేసిన మేనిఫెస్టోపై జనం నుంచి మంచి స్పందన వస్తోంది. అన్ని సర్వేలు మనకు అనుకూలంగానే ఉన్నాయి. మూడో సారి కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నరు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు విభిన్నంగా ఆలోచించాలి. అభివృద్ది వైపే నిలవాలి’ అని సూచించారు.