బీఆర్ఎస్​ హ్యాట్రిక్ ​కొట్టడం ఖాయం: పువ్వాడ అజయ్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ఖమ్మం సిటీని నలుమూలలా డెవలప్​చేశానని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ప్రతి కాలనీలో అన్నిరకాల మౌలిక వసతులు కల్పించానని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి బీఆర్ఎస్​ హ్యాట్రిక్ ​కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం ఖమ్మంలోని ప్రగతి ప్రైడ్ లో స్థానిక లీడర్​చావా రాము ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి అజయ్​ పాల్గొని మాట్లాడారు.

అభివృద్ధిలో ఖమ్మం అనేక మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. బీఆర్ఎస్​ప్రభుత్వంలో నియోజకవర్గానికి వచ్చినన్ని నిధులు గతంలో ఎప్పుడూ రాలేదన్నారు. గొంగళి పురుగులా ఉన్న ఖమ్మంను సీతాకోకచిలుకలా మార్చానన్నారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మరోసారి బీఆర్ఎస్​ను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

కార్యక్రమంలో టీఎస్​ఐడీసీ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, మండేపూడి జగదీశ్, మద్దినేని వెంకటరమణ, గరికపాటి వెంకటేశ్వరరావు, కాటా సత్యనారాయణ బాబ్జీ, వల్లభనేని రామారావు, నెల్లూరి చంద్రయ్య, డాక్టర్ కన్నేకంటి శివరామకృష్ణ, డాక్టర్ నాగేశ్వరరావు, చుంచు గోపి తదితరులు పాల్గొన్నారు.

ALSO READ :రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: కౌశిక్ రెడ్డి

మున్నేరు వరద బాధితులకు సాయం

మున్నేరు వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకున్నామని మంత్రి అజయ్ చెప్పారు. ఆదివారం ఖమ్మంలోని నయా బజార్ గవర్నమెంట్​స్కూల్​ఆవరణలో 1,718 మంది బాధితులకు వరద సాయం చెక్కులు పంపిణీ చేశారు. తన విజ్ఞప్తి మేరకు ఎంపీ బండి పార్థసారథిరెడ్డి వరద బాధితులకు రూ.కోటి, తన కోడలు అపర్ణ రూ.50 లక్షలు ఇచ్చారని, ఆ మొత్తాన్ని చెక్కుల రూపంలో పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్​వీపీ గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, బీఆర్ఎస్​నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు యాదవ్, ఆర్డీఓ గణేశ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.