వైరా, వెలుగు: మేలు రకం పశువులను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. శనివారం వైరాలోని జిల్లా పశుగణాభివృద్ధి ఆఫీసు ఆవరణలో జాతీయ కృత్రిమ గర్భధారణ ఆధునిక సాంకేతికత, నిపుణుల సదస్సులో ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ తో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం ఖమ్మం జిల్లాలో 40 మంది గోపాలమిత్రల సంఖ్యను 250 మందికి పెంచినట్లు చెప్పారు. గోపాల మిత్రలతో పాటు పశువైద్యులు పశు పోషకులకు అవగాహన కల్పించాలని సూచించారు. నల్లమల వెంకటేశ్వరరావు, బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, గోపాలమిత్ర జిల్లా పశుగాణాభివృద్ధి సంస్థ చైర్మన్ కొర్రకుంట్ల నాగేశ్వరరావు ,జిల్లా పశుగణాభివృద్ధి శాఖ ఈవో కిశోర్, గోపాల మిత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు బొడ్డు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల ప్రారంభం
ఎర్రుపాలెం: మండల కేంద్రంలో రూ1.54 కోట్లతో నిర్మించిన కేజీబీవీ బిల్డింగ్, మండలంలోని భీమవరంలో ఏర్పాటు చేసిన 33/11కేవీ సబ్స్టేషన్నుమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. బనిగండ్లపాడు గ్రామంలో 6 పడకల దవాఖానా, అడిషనల్ క్లాస్రూమ్, బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం బంజర సర్పంచ్ భుక్యా రంగాతో పాటు పలువురు బీఆర్ఎస్ లో చేరగా, వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్ధ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ కవిత, ఎంపీపీ శిరీష పాల్గొన్నారు.
రామయ్యకు సువర్ణ తులసీదళార్చన
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం బంగారు తులసీదళాలతో అర్చన జరిగింది. ముందుగా గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. రామపాదుకలకు భద్రుని మండపంలో పంచామృతాలతో అభిషేకం చేశారు. స్వామి మూలవరులకు బంగారు తులసీ దళాలతో అర్చన చేసి ప్రత్యేక హారతులిచ్చారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణ క్రతువు నిర్వహించారు. భక్తులు కంకణాలు ధరించి కల్యాణంలో పాల్గొన్నారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ అనంతరం స్వామి రాపత్ సేవకు బయలుదేరారు. గోదావరి తీరాన ఉన్న పునర్వసు మండపంలో స్వామికి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన జరిగాయి. భక్తులకు స్వామి దర్శనం ఇచ్చాక తిరువీధి సేవకు రాజవీధి గుండా గోవిందరాజస్వామి ఆలయానికి వెళ్లారు. పూజలందుకొని తిరిగి ఆలయానికి వచ్చారు. ఏపీహైకోర్టు న్యాయమూర్తి కె మన్మథరావు శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఐటీడీఏ ఎదుట ధర్నా
భద్రాచలం, వెలుగు: గిరిజన ఆశ్రమ పాఠశాలలలో పని చేసే డైలీవేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు శనివారం ఐటీడీఏ ఎదుట ఖాళీ ప్లేట్లతో ధర్నా చేశారు. 22 నెలల నుంచి ప్రభుత్వం జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుందని, వెంటనే వాటిని విడుదల చేసి ఆదుకోవాలని నినాదాలు చేశారు. వేతనాలు ఇవ్వకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. అనంతరం పీవో ఆఫీసులో వినతిపత్రం అందజేశారు.
ఖమ్మం టౌన్: పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. సీఐటీయూ జిల్లా నాయకులు కల్యాణం వెంకటేశ్వరరావు, వై విక్రమ్, బాదావత్ లక్ష్మా ,సంతోష్, లక్ష్మీదేవి, వీరమ్మ, మోహన్, గురవమ్మ
పాల్గొన్నారు.
ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటుకు ప్రతిపాదనలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పాల్వంచలో కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ వద్ద నేషనల్ హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటు రెండు బస్టాప్‌ల ఏర్పాటుకు ప్రపోజల్స్ రూపొందించామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కలెక్టరేట్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్తగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందని, త్వరలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని చెప్పారు. కలెక్టరేట్ వద్ద నేషనల్ హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జితో పాటు రెండు బస్టాప్‌లు నిర్మించేందుకు నేషనల్ హైవే అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు. మీడియా కోసం ప్రత్యేక రూమ్ కేటాయిస్తామని అన్నారు. జిల్లా ప్రజలకు మెరుగైన విద్య, వైద్యం అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, మన ఊరు–మన బడి స్కీమ్‌లో భాగంగా సర్కారుబడుల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.
యువత క్రీడల్లో రాణించాలి
మణుగూరు, వెలుగు: యువత క్రీడల్లో రాణించాలని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ప్రభుత్వ హైస్కూల్లో రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ వాలీబాల్ క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి బహుమతిగా రూ.50 వేలు, రెండో బహుమతిగా రూ.30 వేలు, మూడో బహుమతిగా రూ.20 వేలు, నాలుగో బహుమతిగా రూ. 5 వేలు అందజేయనున్నట్లు తెలిపారు. వారం రోజుల పాటు జరిగే ఈ క్రీడా పోటీలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే క్రీడాకారులకు అన్ని రకాల వసతులు కల్పించామని చెప్పారు. క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేశారు.
ముంపు మండలాల నుంచి వచ్చిన టీచర్లకు షాక్
జీతాలు ఆపేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు
భద్రాచలం, వెలుగు : పోలవరం ముంపు మండలాల నుంచి తెలంగాణకు వచ్చిన టీచర్లకు సర్కార్ షాక్ ఇచ్చింది. 2023 జనవరి నుంచి వారి వేతనాలు ఆపేయాలని ట్రెజరీలకు ఉత్తర్వులు జారీ చేసింది. దాని వివరాలిలా ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత ఖమ్మంలోని ఏడు మండలాలు ఏపీలో కలిశాయి. ఆ మండలాల్లో పని చేసిన 201 మంది టీచర్లు 2015లో రెండు ప్రభుత్వాల నుంచి వీరి ఖాతాల్లో శాలరీలు జమ అయ్యాయి. చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక, కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గంపాడు మండలాల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు నెల నుంచి మూడు నెలల వరకు అదనంగా జీతాలు జమ అయ్యాయి. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 163 మంది, ఖమ్మం జిల్లాలో 23 మంది, మహబూబ్‌బాద్ జిల్లాలో 7గురు,ములుగు జిల్లాలో 4గురు, మరో నలుగురు వేరే చోట ముంపు మండలాల నుంచి తిరిగి తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారు. వీరికి తెలంగాణ సర్కారు రూ.1.58కోట్లు, ఆంధ్రా సర్కారు రూ.1.65కోట్లు ఉపాధ్యాయుల ఖాతాల్లో జమ చేశాయి. కొందరు ఉపాధ్యాయులు అదనపు శాలరీని డీడీల రూపంలో తిరిగి చెల్లించగా.. కొందరు వాడుకున్నారని వెల్లడైంది. వాటిని రికవరీ చేయాలంటూ ఆదేశాలు ఉన్నాయి. ఏడేండ్ల తర్వాత అకస్మాత్తుగా తమ వేతనాలు ఆపాలనడం సమజసం కాదని టీచర్లు అంటున్నారు. దీంతో భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్‌ను టీఎస్‌టీటీఎఫ్ గౌరవ అధ్యక్షులు శంకర్‌నాయక్, జిల్లా అధ్యక్షులు మోహన్, ప్రధాన కార్యదర్శి శంకర్ నాయక్, రాంకుమార్, బిచ్చా, భద్రు తదితరులు కలిసి ఉత్తర్వులు నిలుపుదల చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వాయిదా పద్ధతుల్లో రికవరీ చేసుకోవాలని టీఎస్‌యుటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు డిమాండ్ చేశారు.
ఐటీడీఏ ఎదుట ధర్నా
భద్రాచలం, వెలుగు: గిరిజన ఆశ్రమ పాఠశాలలలో పని చేసే డైలీవేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులు శనివారం ఐటీడీఏ ఎదుట ఖాళీ ప్లేట్లతో ధర్నా చేశారు. 22 నెలల నుంచి ప్రభుత్వం జీతాలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతుందని, వెంటనే వాటిని విడుదల చేసి ఆదుకోవాలని నినాదాలు చేశారు. వేతనాలు ఇవ్వకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. అనంతరం పీవో ఆఫీసులో వినతిపత్రం అందజేశారు.
ఖమ్మం టౌన్: పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్ డైలీవేజ్, ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం ఖమ్మం ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. సీఐటీయూ జిల్లా నాయకులు కల్యాణం వెంకటేశ్వరరావు, వై విక్రమ్, బాదావత్ లక్ష్మా ,సంతోష్, లక్ష్మీదేవి, వీరమ్మ, మోహన్, గురవమ్మ
పాల్గొన్నారు.
బడి బయట పిల్లల సర్వే పక్కాగా చేయాలి
పాల్వంచ, వెలుగు: బడి బయట పిల్లల వివరాలను సేకరించే విషయంలో నిర్లక్ష్యం చేయవద్దని జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ ఎ నాగరాజ శేఖర్ సూచించారు. శనివారం పాల్వంచలోని బొల్లోరుగూడెం సరస్వతి శిశు మందిర్ లో ఎంఈవోలు, కాంప్లెక్స్ హెచ్ఎంలు, సీఆర్పీలు, ఐఈఆర్పీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వయసుకు తగిన స్కూల్లో చేర్పించేందుకు ఈ సర్వే పనికి వస్తుందని చెప్పారు. ఏఎస్వో సతీశ్, కోఆర్డినేటర్ సైదులు, పరీక్షల సహాయక కమిషనర్ ఎస్ మాధవరావు, పాల్వంచ ఎంఈవో శ్రీరామమూర్తి పాల్గొన్నారు.