బీజేపీ సహా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుట్రలను ప్రజలకు తెలియజేస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కొరటికల్ గ్రామం నుంచే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రచారం ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. టీఆర్ఎస్ శ్రేణులు సమన్వయలోపాన్ని వదిలేసి పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
మునుగోడు ఉపఎన్నిక రాజగోపాల్ రెడ్డి స్వార్థం వల్లే వచ్చిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. 18వేల కోట్ల కోసమే బీజేపీలో చేరినట్లు రాజగోపాల్ రెడ్డి స్వయంగా ఒప్పుకున్నారని అన్నారు. మునుగోడు ప్రజలను మోసం చేసిన ఘనుడు అని విమర్శించారు. బీఆర్ఎస్తో దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ అడుగుపెడుతున్నారని చెప్పారు.