ఆరోపణలను నిరూపిస్తే ఆస్తి మొత్తం రాసిస్తా : పువ్వాడ అజయ్

ఖమ్మం, వెలుగు :  తనపై కాంగ్రెస్​ నేతలు చేసిన అవినీతి ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా, తన ఆస్తి మొత్తాన్ని ప్రజలకు రాసిస్తానని ఖమ్మం బీఆర్ఎస్​ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్​ సవాల్ చేశారు. ఎన్నికల్లో గెలవడం కోసం, పదవి కోసం విచక్షణ కోల్పోయి కాం గ్రెస్​ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగడం బాధాకరమన్నారు. తాను చేసిన అభివృద్ధిని కూడా తుమ్మల చేసినట్టుగా చెప్పుకోవడం, మందికి పుట్టిన బిడ్డను తనకు పుట్టినట్టు చెప్పుకోవడంలా ఉందని ఎద్దేవా చేశారు. సోమవారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్​ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదివారం తనపై తుమ్మల చేసిన కామెంట్లపై ఆయన ఘాటుగా స్పందించారు. ఖమ్మం ప్రజలను మోసం చేసేందుకు పోటీపడుతున్న వారి నటనకు ఆస్కార్ అవార్డు కూడా సరిపోదన్నారు. ఖమ్మం ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చిన ప్రజలకు మంత్రి అజయ్​ ధన్యవాదాలు తెలిపారు.