తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే.. పొంగులేటిపై పువ్వాడ పరోక్ష కామెంట్స్

తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే

పొంగులేటిపై పువ్వాడ పరోక్ష కామెంట్స్

హైదరాబాద్, వెలుగు : తప్పు చేస్తే ఎవ్వ రైనా శిక్ష అనుభవించాల్సిందేనని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఇది తమ పార్టీ వారికైనా పార్టీ నుంచి బయటికెళ్లిన వారికైనా వర్తిస్తుందని పొంగులేటి శ్రీనివాస్​ను ఉద్దేశించి పరో క్షంగా కామెంట్ చేశారు. సోమవారం ఆయన ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసును తనిఖీ చేసి మీడియాతో మాట్లాడారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా తెలం గాణ రవాణా శాఖలో విప్లమాత్మక మార్పులు తీసుకొచ్చామని వెల్లడిం చారు. రాష్ట్రంలో వెహికల్స్ సంఖ్య  కోటి 20లక్షలకు చేరు కుందని తెలిపారు. ఆర్టీఏ వెబ్ సైట్ లో టెక్నికల్ ప్రాబల్స్ రాకుండా చూస్తామ న్నారు. ఎం వ్యాలెట్​ ఎక్కువగా యూజ్​ చేయాలని ప్రజలను కోరారు.

ALSO READ:ఏం జరుగుతున్నది? ఇండియాలో అడుగుపెట్టగానే మోదీ అడిగిన తొలి ప్రశ్న