ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: కార్మికులు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా, హక్కుల కోసం వీరోచితంగా పోరాడి మేడేను సాధించుకున్నారని రాష్ర్ట రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్అన్నారు. సోమవారం మే డే సందర్భంగా ఖమ్మం త్రీటౌన్మిర్చి మార్కెట్ వద్ద బీఆర్ఎస్ కార్మిక సంఘం ఆఫీస్లో జెండాను ఆవిష్కరించారు. అనంతరం మార్కెట్ కార్మికులకు యూనిఫాంలను అందజేశారు. మిర్చి మార్కెట్నుంచి ఖమ్మం– వైరారోడ్, జమ్మిబండ మీదుగా మేడే ర్యాలీలో కార్మికులతో కలిసి నడిచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కార్మిక, కర్షకుల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్పనిచేస్తున్నారన్నారు. ఖమ్మంలో ఈఎస్ఐ ఆస్పత్రిని ప్రారంభించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నగర మేయర్పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్విజయ్కుమార్, నగర బీఆర్ఎస్ అధ్యక్షుడు పగడాల నాగరాజు, ఏఎంసీ చైర్మన్దొరేపల్లి శ్వేత పాల్గొన్నారు.
జిల్లా వ్యాప్తంగా ఘనంగా మే డే
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లా వ్యాప్తంగా మే డే వేడుకలను కార్మిక సంఘాలతోపాటు పలు పార్టీలు, ప్రజాసంఘాలు సోమవారం ఘనంగా నిర్వహించాయి. చికాగో అమరులను కార్మికులు స్మరించుకున్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎర్రజెండాలను ఎగురవేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్పాష పలుచోట్ల ఎర్రజెండాలను ఎగురవేశారు. సింగరేణి కాలరీస్ వర్కర్స్యూనియన్, ఏఐటీయూసీ నేతలు గుత్తుల సత్యనారాయణ, దమ్మాలపాటి శేషయ్య, వంగా వెంకట్, వీరస్వామి, సీపీఎం, సీఐటీయూ నాయకులు మందా నర్సింహరావు, భూక్యా రమేశ్, ఇఫ్టూ, టీబీజీకేఎస్, ఐఎన్టీయూసీఆధ్వర్యంలో ఎర్రజెండాలను ఎగురవేశారు. ఆర్టీసీ, సింగరేణి బొగ్గు గనుల్లో కార్మిక సంఘాల నేతలు ఎర్రజెండాలను ఎగురవేశారు.
వెట్టి చాకిరి విముక్తికి పోరాడదాం...
ఖమ్మం రూరల్, వెలుగు: మే డే సందర్భంగా మండలంలో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో ఎర్ర జెండాను ఎగురవేశారు. తెల్దారుపల్లి, నాయుడుపేట, ఆరెకోడు, కాచిరాజు గూడెం, ఏదులాపురంలల్లో ర్యాలీలు తీశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ కార్మికులు వెట్టి చాకిరి నుంచి విముక్తి కోసం పోరాడి ఎనిమిది గంటల పని దినాన్ని సాధించుకున్న రోజన్నారు. సీపీఎం పాలేరు నియోజకవర్గ ఇన్ చార్జి బండి రమేశ్, మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్, జిల్లా కమిటీ సభ్యుడు ఉరడి సుదర్శన్ రెడ్డి, సీనియర్ లీడర్లు సిద్దినేని కోటయ్య, బత్తినేని వెంకటేశ్వరరావు, తమ్మినేని వెంకట్రావు, తోట పెద్ద వెంకటరెడ్డి పాల్గొన్నారు.