ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : ఖమ్మం సిటీలోని తన క్యాంప్ఆఫీసులో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శుక్రవారం ఫ్రీ డ్రైవింగ్లైసెన్స్ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సెప్టెంబర్ 23 వరకు కొనసాగే లైసెన్స్మేళాను18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని సూచించారు. మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకు ఈ మేళాను ప్రారంభించినట్లు చెప్పారు. మొత్తం ఖర్చును పువ్వాడ ఫౌండేషన్భరిస్తుందని తెలిపారు. అనంతరం స్లాట్ బుక్‌చేసుకున్న వారికి ఎల్ఎల్ఆర్అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ నీరజ, సుడా చైర్మన్ విజయ్‌కుమార్, పగడాల నాగరాజు, ఆర్టీఓ కిషన్‌రావు, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, మగ్బూల్, మందడపు లక్ష్మి, దండా జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తమను మినహాయించాలని వినతి
ఖమ్మం టౌన్, వెలుగు : వైద్య ఆరోగ్యశాఖలోని ఉద్యోగులకు జీపీఎస్ఆధారిత ఫేస్రికగ్నైజేషన్ అటెండెన్స్నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్.అఫ్జల్ హసన్, ఆర్.వి.ఎస్.సాగర్ ఆధ్వర్యంలో ఉద్యోగులు మంత్రి పువ్వాడ అజయ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఖమ్మం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన విధానంతో ఫీల్డ్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే వెటర్నరీ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు. మంత్రి స్పందిస్తూ ఇప్పటికే వైద్యశాఖ కమిషనర్ శ్వేతామహంతితో మాట్లాడానని, మంత్రి హరీశ్‌రావు, సీఎస్దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేలా చూస్తానని హామీ ఇచ్చారు.