ఖమ్మం టౌన్,వెలుగు: పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ పాటించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన స్వచ్ఛ గురుకుల్ వారోత్సవాల్లో భాగంగా ఖమ్మం సిటీలోని ఎన్ఎస్పీ క్యాంపులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కాలేజీలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎడతెరిపి లేని వానల కారణంగా డెంగీ, టైఫాయిడ్, మలేరియా, డయేరియా, ఫుడ్ పాయిజన్, వైరల్ జ్వరాలు వస్తున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్వచ్ఛ గురుకుల్ కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. భోజనం, వసతి విషయాల్లో నిర్లక్ష్యం చేయొద్దన్నారు. అనంతరం కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్‌ను పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కలెక్టర్ వీపీ గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, గురుకులాల జాయింట్ సెక్రటరీ శారద, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ రాధిక గుప్తా, ఆర్సీవో ప్రత్యూష, ప్రిన్సిపాల్ చావా జ్యోతి, కార్పొరేటర్ శ్రీవిద్య పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “స్వచ్చ గురుకులం”లో భాగంగా@MC_Khammam NSP క్యాంప్ లోని https://t.co/aZnO3elzA2 అంబేడ్కర్ సోషల్ వెల్ఫేర్ కళాశాలలో పరిశుభ్రత పరిశీలించి, విద్యార్ధినిలతో కలిసి సహపంక్తి భోజనం చేయడమైంది(1/3). @TelanganaCMO @MinisterKTR @KTRTRS @SatyavathiTRS @Collector_KMM pic.twitter.com/KEwkTJbjcC
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) September 10, 2022