రేవంత్ రెడ్డిపై మంత్రి పువ్వాడ ఫైర్

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కమిషన్ల కోసం 24 గంటల కరెంట్ ఇస్తున్నారని రేవంత్ చెప్పడం దారుణమని మంత్రి ఫైర్‌ అయ్యారు. అమెరికాలో రైతుల గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇది రైతుల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ది అని విమర్శించారు. 3 గంటల కరెంట్ ఇస్తామని దమ్ముంటే మీ మ్యానిఫెస్ట్ లో పెట్టండని రేవంత్ కు ఛాలెంజ్ విసిరారు. అలా చేస్తే బీఆర్ఎస్ ను రైతులు గ్రామాల్లోకి కూడా రానివ్వరని మండిపడ్డారు. రైతుల పట్ల రేవంత్ రెడ్డికి ఉన్న ప్రేమ ఏంటో ఇప్పుడు అర్ధమవుతుందని తెలిపారు. మీరు ఎన్ని చెప్పినా రైతులకు ఖచ్చితంగా 24గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పారు. గాంధీ భవన్ లో దూరిన గాడ్సే రేవంత్ రెడ్డి.. ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన అదృష్టం కాళేశ్వరమన్నారమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టిన శని అని విమర్శలు చేశారు.

దేశ ప్రజలను ఐక్యంగా ఉంచడంలో కేసీఆర్ భారతదేశానికి నాయకత్వం వహిస్తారని మంత్రి పువ్వాడ తెలిపారు. హిందుత్వ- ముస్లిం వాద పార్టీలకు ఖమ్మంలో చోటు లేదని చెప్పారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పౌరస్మృతి చట్టాన్ని వ్యతిరేకించడాన్ని సాదరంగా ఆహ్వనిస్తున్నామన్నారు. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 44 లో ఉన్న సూచనను బలవంతంగా ప్రజలపై రుద్దాలని చూస్తున్నారని విమర్శించారు. ఎవరి ఆచారాలు ఎలా ఉన్నా కానీ.. మనమంతా మనుషుల్లాగా కలిసి ఉన్నామని చెప్పారు.  బీజేపీ మతాల, కులాల ఆచారాలను నాశనం చేయాలని చూస్తుందని మంత్రి పువ్వాడ విమర్శించారు.