ఖమ్మం టౌన్,వెలుగు; ప్రతీ వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందించామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం అర్బన్ మండలం మల్లేమడుగులో రూ.11.61 కోట్లతో నిర్మించిన192 డబుల్ బెడ్ రూం ఇళ్లను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరెన్నో పథకాలు రావాలంటే సీఎం కేసీఆర్ ను మళ్లీ ఆశీర్వదించాలని కోరారు.
మండలంలో మొత్తం 2500 ఇళ్లు కట్టించామన్నారు. దానవాయిగూడెం ప్రధాన రోడ్డు నుంచి సీసీ రోడ్డు, అండర్ బ్రిడ్జిని మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందన్నారు. అనంతరం ఖమ్మంలోని పలు డివిజన్ లలో రూ.7.35 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం వి.ఆర్. బంజర, జీకే బంజర, పాపాటపల్లి గ్రామంలో రూ.1.95 కోట్లతో చేపట్టిన సీసీ డ్రెయిన్లు, సీసీ రోడ్స్, డొంక రోడ్లు, హై మాస్ట్ లైట్స్ పనులను ప్రారంభించారు.
టీఎన్జీఓస్ ఆఫీస్ ప్రారంభం
నగరంలోని ఓల్డ్ డీపీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన జిల్లా టీఎన్జీఓస్ కార్యాలయాన్ని శనివారం మంత్రి పువ్వాడ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులకు ఎల్లప్పుడూ అండగా ఉంటోందన్నారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు అఫ్జల్ హస న్, సాగర్, మేయర్ నీరజ, సూడా చైర్మన్ విజయ్ కుమార్, సంఘ నాయకులు నందగిరి శ్రీను, ప్రసాద్ రావు, జ్యోతి, ఉద్యోగులు పాల్గొన్నారు.