ఉస్మానియా కొత్త ఆస్పత్రిని రెండేళ్లలో పూర్తిచేస్తామన్నారు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా. గోషామహల్ స్టేడియలో కొత్త ఆస్పత్రికి భూమి పూజ చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రూ. 2,700 కోట్లతో12 అంతస్తుల హాస్పిటల్, నాలుగు వైపుల రోడ్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో హాస్పిటల్ నిర్మిస్తున్నామని తెలిపారు. రెండేళ్లలో పూర్తి చేసి వైద్య సేవలు అందిస్తామన్నారు.
ఆసుపత్రి కొత్త భవనం ఉండాలని ఒక కళ ఉండేది. ఈ ప్రక్రియ మొదలై ఆరు నెలలైంది. వేరే ప్రాంతంలో కూడా హాస్పిటల్ ఏర్పాటు చేయాలని ప్రపోజల్ వచ్చాయి. గోషామహల్ స్టేడియం ఉన్నది 38 ఎకరాల్లో .. ఇందులో 26 ఎకరాలు హాస్పిటల్ కోసం తీసుకున్నాం. ఇంకా 11 ఎకరాలు ఓపెన్ ఉంచాం. హెలిప్యాడ్ రూపంలో కూడా పక్కన ఉన్న పోలీస్ గ్రౌండ్ ను వాడుకుంటాం. ఎవరికి నష్టం రాకుండా హాస్పిటల్ నిర్మిస్తాం. గోషామహల్ లో రోడ్లు ఇరుకుగా ఉంటాయి కాబట్టి స్కై వాక్ లు ఏర్పాటు చేస్తాం. రెసిడెన్షియల్ ఆడిటోరియంతో అన్ని వసతులతో కూడిన ఆసుపత్రిని నిర్మించబోతున్నం. మొత్తం 40 డిపార్ట్మెంట్ లు సేవకు అందించనున్నాయి. ఏ రోగానికి అయినా వైద్యం అందుతుంది. ఇది లేదు అనకుండా అన్ని రకాల పరికరాలు ఉంటాయి. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందిస్తామని మంత్రి దామోదర తెలిపారు.