
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక రాజధాని అమరావతిలోనే అభివృద్ధి సరిగా జరగడం లేదని..అలాంటిది మూడు రాజధానుల ప్రతిపాదన సరికాదన్నారు కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే. విజయవాడలో ఆయన మాట్లాడుతూ ..మూడు రాజధానులను ఏర్పాటు చేసి తీరుతామని ఇప్పటికీ రాష్ట్ర మంత్రులు చెపుతూనే ఉన్నారు. మూడు రాజధానులతో ప్రజలకు సౌలభ్యంగానే ఉంటుందని… కానీ, మూడు రాజధానులను అభివృద్ధి చేయడం చాలా కష్టమని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రధాని మోడీని సీఎం జగన్ కలసి కోరాలని సూచించారు. ఏపీ అభివృద్ధి కోసం బీజేపీతో, జగన్ చేతులు కలపాలని సూచించారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం కోసం తాను కూడా ప్రయత్నిస్తానని చెప్పారు. పార్లమెంటులో ప్రవేశపెట్టే అన్ని బిల్లులకు YCP మద్దతిస్తోందని తెలిపారు మంత్రి అథవాలే.
మరిన్ని వార్తల కోసం..