వైసీపీ మంత్రి రోజా ఆస్తులు ఎంతో తెలుసా?

సినీ నటి, ఏపీ మంత్రి ఆర్ కె రోజా.. రాజకీయాల్లో ప్రతిపక్ష నాయకులను తన పదునైన మాటలతో విరుచుకుపడుతూ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. 2019లో వైసీపీ తరుపున నగరిలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె.. పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నారు. 

ఇప్పుడు మరోసారి ఆమె ..నగరి ఎమ్మెల్యే అభర్థిగా బరిలో దిగుతున్నారు. మే 13న రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో నామినేషన్ పక్రియ ప్రారంభమైంది. ఈక్రమంలో ఆర్ కె రోజా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు.  ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు.


అఫిడవిట్ లో తెలిపిన వివరాల ప్రకారం.. 2019లో రోజా ఆస్తులు రూ.9.03 కోట్లు ఉండగా.. ప్రస్తుతం ఆమె ఆస్తులు రూ.13.07 కోట్లకు పెరిగింది. మొత్తం ఆస్తిలో రూ.5.09 కోట్ల చరాస్తులు, రూ.7.08 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయని వెల్లడించారు. ఇక, కోటి రూపాయల విలువైన బెంజ్‌ కారుతోపాటు మరో 9 కార్లు ఉన్నాయని తెలిపారు.