ఆయనది మాటల ప్రభుత్వం.. మాది చేతల ప్రభుత్వం: మంత్రి రోజా

ఆయనది మాటల ప్రభుత్వం.. మాది చేతల ప్రభుత్వం: మంత్రి రోజా

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రాన్ని అప్పుల పాలుచేశాడని విమర్శించారు మంత్రి రోజా.   చంద్రబాబుది మాటల ప్రభుత్వమైతే... సీఎం జగన్ ది చేతల ప్రభుత్వమన్నారు. అందుకే  ఏపీ సీఎం బె స్ట్ 5 సీఎంల జాబితాలో నిలిచారని మంత్రి తెలిపారు. చంద్రబాబు డ్రామాల గురించి రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసంటూ .. ఆయనకు కష్టాలు వచ్చినప్పుడల్లా దాన్ని ప్రజల సమస్యగా చిత్రీకరించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తాడని విమర్శించారు. ఇప్పుడు రూ.118 కోట్ల ముడుపుల కేసులో జైలుకెళ్లడం ఖాయమని తెలిసి.. చంద్రబాబు సింపతీ కోసం కొత్త డ్రామా ఆడుతున్నాడు. ఆర్కే రోజా పేర్కొన్నారు.