షాకింగే : మార్గదర్శిలో రోజాకు రూ.40 లక్షల చిట్టీ

ఏపీలో ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. నామినేషన్ల పర్వం మొదలైన నేపథ్యంలో నేతలంతా నామినేషన్ పాత్రలతో ఆర్వో ఆఫీసులకు క్యూ కట్టారు. నామినేషన్లో నేతల ఆస్తులు కేసులు వివరాలు కూడా వెల్లడిస్తున్న నేపథ్యంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో మంత్రి రోజా దాఖలు చేసిన అఫిడవిట్లో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే, రోజా మార్గదర్శి సంస్థలో రూ.39.21 లక్షలు విలువ చేసే చిట్స్ కొన్నట్లు అఫిడవిట్లో వెల్లడించింది.

రోజా మార్గదర్శిలో పెట్టుబడులు పెట్టారన్న అంశం చర్చనీయాంశం అయ్యింది. మార్గదర్శిలో అవినీతి జరుగుతోందంటూ వెటరన్ పొలిటీషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్న న్యాయ పోరాటానికి వైసీపీ ప్రభుత్వం కూడా మద్దతు తెలుపుతున్న క్రమంలో రోజా మార్గదర్శిలో పెట్టుబడి పెట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. మార్గదర్శి అధినేత రామోజీని ఇరుకున పెట్టే ప్లాన్ లో భాగంగానే రోజాతో పెట్టుబడులు పెట్టించిందా అన్న అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. మరి, పొలిటికల్ హీట్ పీక్స్ లో ఉన్న వేళ పెద్ద చర్చకు దారి తీసిన ఈ అంశం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో వేచి చూడాలి.