
హైదరాబాద్, వెలుగు : ఏపీలోని ఓబుళాపురం గనుల కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హైకోర్టులో క్రిమినల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. సబిత దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్‌ను సీబీఐ కోర్టు గత ఏడాది అక్టోబర్‌లో కొట్టేసింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసుతో సంబంధం లేదని పేర్కొన్నారు. సీబీఐ వేసిన రెండు చార్జ్షీట్లలో తన పేరు లేదని, అయినా నిందితురాలిగా చేర్చిందని, దీనికి తగిన కారణాలు చూపలేదని పిటిషన్లో తెలిపారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు గనుల మంత్రిగా ఉన్నందున నిందితురాలిగా చేర్చడం అన్యాయమని చెప్పారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారించనుంది.